![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -330 లో... గంగ, రంగా ఇద్దరు సూపర్ మార్కెట్ కి వస్తారు. కార్తీక్ ఒక దగ్గర ప్రమీల ఒక దగ్గర వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు ఇద్దరు ఎలా ఒకటి అవుతారని గంగ అనుకొని వాళ్ళని కలపాలని చూస్తుంది. కార్తీక్ దగ్గరికి గంగ వచ్చి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. మీకు పెళ్లి అయితే జాబ్ మానేస్తారు కదా.. ఒకవేళ మీ ఆవిడకి జాబ్ వేరే దగ్గర ఉంటే అక్కడికి వెళ్తారు కదా అని గంగ అంటుంది. కార్తీక్ దూరంగా వెళ్తాడు అన్న మాటలన్నీ ప్రమీల మైండ్ లో గంగ ఫిక్స్ చేస్తుంది.
మరొకవైపు మక్కమ్ తన భార్యతో ఫోన్ లో చిరాకుగా మాట్లాడుతుంటే అప్పుడే రంగా వస్తాడు. పెళ్ళాలు గొడవ పెట్టుకోవడం అనేది వాళ్ళ హక్కు.. అసలు పెళ్లే చేసుకోవద్దు.. నేను ఒక జ్ఞానిని కాబట్టి పెళ్లి చేసుకోలేదని రంగా అంటుంటే మీరు గొప్పవారు సర్ అని మక్కమ్ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి రంగా ఫోన్ లో మాట్లాడుతాడు. పాప అన్నం తిన్నదా అంటూ రంగా ఫోన్ మాట్లాడటం మక్కమ్ విని పెళ్లి కాలేదని నాతో అబద్దం చెప్తాడా అని గంగ, కార్తీక , ప్రమీల దగ్గరికి వెళ్లి మీ అన్న రంగాకి పెళ్లి అయిందని చెప్తాడు. ఆ మాటలు విని అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదని గంగ కోప్పడుతుంది.
అసలు నేను చెప్పేది విను అని రంగా ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోరు.. తనకి భార్య కాకుండా ఒక పాప కూడా ఉందని మక్కమ్ చెప్తాడు. ఒరేయ్ నేను మాట్లాడింది వేరు.. నువ్వు విన్నది వేరు.. నేను మాట్లాడింది పాప గురించి కాదు ఒంటె పిల్ల గురించి.. అది నేను తినిపిస్తనే తింటుందని దుబాయ్ లో తను ఒంటెలతో ఉన్న ఫోటో చూపిస్తాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |